40 సూచికల్లో వృద్ధి సాధించాలి
పెనుగంచిప్రోలు:నీతి అయోగ్ ఆకాంక్షిత బ్లాక్(ఏబీపీ)లుగా ఉమ్మడి జిల్లాలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను గుర్తించామని కేంద్ర ప్రభారీ అధికారి, కేంద్ర జలసంఘం డైరక్టర్ నేలపట్ల అశోక్‌కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెనుగంచిప్రోలు, ముండ్లపాడు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలను కలుసుకుని వారితో మాట్లాడారు. వ్యాపారా న్ని మరింత వృద్ధి చేసుకునేందుకు సూచనలు చేశారు. హైస్కూల్‌లో వంట షెడ్ నిర్మాణం కోసం పాఠశాల పూర్వ విద్యార్థులను సంప్రదించాలని హెచ్‌ఎంకు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు లేరని ఇన్‌చార్జీ వైద్యులు వస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డీఎంహెచ్‌ఓ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ వైద్యుల పోస్టులు కొద్ది రోజుల్లో భర్తీ అవుతాయన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి అయోగ్ నిర్దేశించిన 40 సూచికల్లో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలాల్లో వెనుకబడిన సూచికల్లో మరింత వృద్ధి సాధించటానికి అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభారీ అధికారి అశోక్‌కుమార్


