
కేడీీసీసీ బ్యాంక్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
జగ్గయ్యపేట అర్బన్: కేడీసీసీ బ్యాంక్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. కేడీసీసీ బ్యాంక్ జగ్గయ్యపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు, బ్యాంకు సిబ్బంది, ఇన్‌చార్జ్‌లతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం బ్యాంక్ బ్రాంచ్ టార్గెట్ రూ 361 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.310 కోట్లు సాధించామని చెప్పారు. అనంతరం ఆయన గోపాలకృష్ణ లార్జ్ సైజ్ కోపరేటివ్ సొసైటీ, కృష్ణాఫార్మర్స్ సొసైటీలను సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ పరిధిలో నడుస్తున్న జన ఔషది మెడికల్ స్టాల్స్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, గోపాలకృష్ణ, కృష్ణా ఫార్మర్స్ సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు.
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్