
మహిళల నిరసనాగ్రహం
నకిలీ మద్యంపై
ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లు పగలకొట్టి ఆందోళన
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి బుధవారం మారుతీనగర్ ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను పగలకొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తామని.. ప్రజల ప్రాణాలను రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా కల్తీమద్యాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మీడియా ఏకరువు పెడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం సూత్రధారి అని చెబుతున్న టీడీపీ నాయకుడు విదేశాలకు పారిపోయి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పటంలో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎకై ్సజ్ శాఖ మంత్రి ఎక్కడ?
రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ఏమై పోయారని మహిళా నేతలు ప్రశ్నించారు. సీ్త్రశక్తి అంటూ సీ్త్రలకు ప్రాధాన్యం అంటూ చెప్పే చంద్రబాబు సీ్త్రల తాళిబొట్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.