
నృత్యరూపకం
నయన మనోహరం..
విజయవాడ కల్చరల్: దసరా మహోత్సవాల సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం (సిద్ధార్థ అకాడమీ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీ కళావేదికపై శుక్రవారం ప్రదర్శించిన మహాకాళి నృత్యరూపకం నయన మనోహరంగా సాగింది. హైదరాబాద్ ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ అనూరాధ బృందం ప్రదర్శించిన రూపకం ఆసక్తికరంగా సాగింది. దేవీభాగవతం, దేవీ సప్తశతి ఆధారంగా కథను రూపొందించారు.అనూరాధ జొన్నలగడ్డ, నృత్యపర్యవేక్షణలో కాత్యాయని, అపర్ణ, వైష్ణవి, అనూషా తదితరులు నృత్యాలను అభినయించారు. నాట్యాచార్యుడు, వేదాంతం రాధేశ్యాం. డాక్టర్ చింతా రవి బాలకృష్ణ కళాపీఠం నిర్వాహకులు లలిత్‌నారాయణ ,వెల్లంకి నాగభూషణరావు, బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు.

నృత్యరూపకం