
లక్షమందికి రుణాలివ్వడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాల్‌మనీ, అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు తమసంస్థ తరఫున అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గోదావరి–కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ (జీకె) లిమిటెడ్ చైర్మన్ మేడూరి జీవన్ వెంకట్రావ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా లక్ష మంది చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శివారులోని సీఎ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఆసంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూ.83.60 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నామని, అందులో రూ.59.41 కోట్లు మేర రుణాలను ఇచ్చి లాభాల బాటలో అడుగుపెట్టామని తెలిపారు. ధర్మ నిధి ఇన్‌కం స్కీమ్ ద్వారా ఆలయాలు, చర్చిలు, మసీదులు, వృద్ధ, అనాధ ఆశ్రమాలు వంటి స్వచ్చంద సేవా సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించే డిపాజిట్లపై 14.4 శాతం వడ్డీ అందించున్నట్లు తెలిపారు.సొసైటీజనరల్ సెక్రటరీ పూర్ణిమ దామెర్ల, డైరెక్టర్లు, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
మేడూరి జీవన్‌వెంకట్రావ్