తిరుమలకు 10 టన్నుల కూరగాయలు | - | Sakshi
Sakshi News home page

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు

Sep 24 2025 4:53 AM | Updated on Sep 24 2025 4:55 AM

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన జానపద కళలకు జీవంపోస్తాం బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు విరాళంగా పంపించారు. కూరగాయల లారీని మంగ ళవారం బెంజిసర్కిల్‌ సమీపంలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంఘ అధ్యక్షుడు నాగ మోతు రాజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి ఎ.వి.వి.సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, బి.ఎ.నాగు పాల్గొన్నారు.

విమానాశ్రయం(గన్నవరం): ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ఈ నెల 24వ తేదీన విజయ వాడ వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై మంగళ వారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక భద్రత అధికారి సీహెచ్‌.రామకృష్ణ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం చంద్రబాబునాయుడు, పలువురు ప్రముఖులు విమానాశ్రయానికి వస్తారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే విషయంలో లైనప్‌ జాబితాలో పేర్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, వారి వాహనాలకు సరైన పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మంగళగిరి ఏపీఎస్పీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.వి.హనుమంతు ఆధ్వర్యంలో పోలీస్‌ బ్యాండ్‌, కవాతు రిహార్సల్స్‌ నిర్వహించారు. ఐసీఎస్‌ అధి కారి జి.ఆర్‌.రాధిక పర్యవేక్షణలో వాహన శ్రేణి ట్రయిల్‌ రన్‌ జరిపారు. గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓ ఎ.వెంకటరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): జానపద కళలకు పునరుజ్జీవం కల్పించి సజీవంగా నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర జానపద, సృజనాత్మకత అకాడమి చైర్మన్‌ డాక్టర్‌ వంపూరు గంగులయ్య భవానీపురం హరిత బెరంపార్క్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గంగు లయ్యతో మంత్రి దుర్గేష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గంగులయ్య మాట్లాడుతూ.. రంప చోడవరం నుంచి భద్రాచలం వరకు ఐటీడీ అధికారులతో సమావేశమై ప్రాచీన కళలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ జి.గోపాలకృష్ణ, ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌ తేజస్వి పొడపాటి, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన కె.బుచ్చి రాంప్రసాద్‌ గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలి పారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో వెయ్యి హిందూ ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూత ఇస్తామన్నారు. దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఏపీ ఎన్నారై చైర్మన్‌ వేమూరి రవి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీ ఎం.చిన్నబాబు, సీఈఓ నాగసాయి, సీనియర్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌ఎల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు
1
1/2

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు
2
2/2

తిరుమలకు 10 టన్నుల కూరగాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement