దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను గురువారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో దేవస్థానానికి రూ.2.17 కోట్ల మేర ఆదాయం లభించింది. మొత్తం 48 హుండీలలో 14 రోజులకు గాను రూ.2,17,98,528 నగదు, 235 గ్రాముల బంగారం, 3.970 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. కానుకలతో పాటు దేశ విదేశాలకు చెందిన కరెన్సీ సైతం లభించింది. యుఎస్‌ఏ డాలర్లు 321, యుఏఈ దిర్హమ్స్ 35, సౌదీ రియాల్స్ 25, ఒమన్ బైసాలు 200, హాంగ్‌కాంగ్ డాలర్లు 500, ఖతార్ రియాల్స్ 24, యూరోప్ యూరోలు 65, థాయిలాండ్ బాట్స్ 40 లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బందితో పాటు దేవదాయ శాఖ అధికారులు పోలీసు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పూర్ణచందుకు బోయి భీమన్న పురస్కార ప్రదానం విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో ఈనెల 19 వ తేదీ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రముఖ కవి డాక్టర్ బోయి భీమన్న జయంతి సభను నిర్వహిస్తున్నట్లు సృజనాత్మక సమితి సీఈవో ఆర్.మల్లికార్జునరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సభలో శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవీ పూర్ణచందుకు డాక్టర్ బోయి భీమన్న పురస్కారం ప్రదానం చేస్తునట్లు తెలిపారు. సభలో బోయి భీమన్న సతీమణి హైమావతితో పాటు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
నవరాత్రులకు ఏపీటీడీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ నూర్‌బాషా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఖాసింబీ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ నూర్‌బాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి రామరాజ్యనగర్‌కు చెందిన షేక్ ఖాసింబీ నియమితులయ్యారు. సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌ఎస్ బాజీ ఆదేశాల మేరకు తన నియామకం జరిగినట్లు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అందించిన సేవలను గుర్తించి నూతనంగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినందుకు ఎస్‌ఎస్ బాజీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై క్రియాశీలకంగా వ్యవహరిస్తూ సంఘం గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. అలానే నూర్‌బాషా సామాజికవర్గ మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరగనున్న దసరా నవరాత్రులకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గురువారం సచివాలయంలోని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించి వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. హైదరాబాద్–విజయవాడ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో రూ.500ల విలువ గల 60 అమ్మవారి శీఘ్రదర్శన టికెట్లతో పాటు ఆలయ ప్రాంగణం వరకు నడిపేందుకు 12 సీటర్ల మినీ వాహనాలను అనుమతించాలని మంత్రికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
1/2
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు
2/2
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు