
వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు పలు ప్రాంతాల్లో అన్నదానాలు, సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా పాల్గొన్న అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత వైఎస్ రాజ శేఖరరెడ్డి సంక్షేమ పాలనకు సరికొత్త అర్థం చెప్పారు. జనరంజక పాలన అంటే ఏమిటో చేసి చూపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. తన ఐదేళ్ల పాలనతోనే జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అలాంటి మహానేత ఈ లోకాన్ని విడిచి పుష్కర కాలం గడిచినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఆయనను మంగళవారం మనసారా స్మరించుకున్నారు. వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుడి సేవ లను కీర్తించారు. ఆయనకు నివాళిగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు చీరలు, నిత్యావసర సరుకులు, రోగులకు పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
●డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ కాంస్య విగ్రహానికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన చేసిన సేవలను కొనియా డారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస రావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూనూరు గౌతంరెడ్డి, అంజిరెడ్డి, పోతిన మహేష్, ఆసిఫ్, రవిచంద్ర, వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
● విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్‌లలో స్థానిక కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జ్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.్ల మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జన హిత సదనం, మల్లాది విష్ణు కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు.
● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, కొండపల్లి పరిధిలో ఏడు చోట్ల, కేతనకొండ, దొనబండ, దాములూరు, జూపూడి, మూలపాడు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు, మైలవరం మండలాల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజ కవర్గ ఇన్‌చార్జ్ జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శులు అప్పిడి కిరణ్‌కుమార్ రెడ్డి, వేములకొండ తిరుపతిరావు, సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు.
● నందిగామ నియోజకవర్గంలో వాడవాడలా మహానేత డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, గొట్టిముక్కల, అల్లూరు, పెద్దాపురం, చందర్లపాడు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్, పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
● తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం, సీఐ కార్యాలయం సెంటరు, రాజుపేట బైపాస్‌రోడ్డు, బోయ కాలనీల్లో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ట స్వామిదాసుతో పాటు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నవీన్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● జగ్గయ్యపేటలోని విలియంపేట, కన్యాకుమార్ పాన్‌షాపు సెంటర్, క్రిస్టియన్‌పేట, కోదాడ రోడ్డు యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్, బస్టాండ్, విజయవాడ బైపాస్ రోడ్డు సెంటర్, దనంబోడు, తొర్రకుంటపాలెం, బొడ్రాయి సెంటర్లలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజ గోపాల్(చిన్నా) పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని శనగపాడు గ్రామం, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం, పొన్నవరం గ్రామాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. కొల్లికొళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు.