
రాష్ట్ర జట్టుకు ‘సిద్ధార్థ’ విద్యార్థినులు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్యార్థినులు రాష్ట్ర ట్రాంపోలిన్ మహిళా వ్యక్తిగత విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఫిజికల్ డైరెక్టర్ రఘు తెలిపారు. ఆయన సోమవారం వివరాలు తెలుపుతూ తమ కాలేజీకి చెందిన క్రీడాకారిణిలు ఎస్.ప్రగ్న, వి.నీలవేణి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్తరా ఖండ్‌లో జరిగేజాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ క్రీడాకారులను అభినందించారు.