
గంజాయి చాక్లెట్లు స్వాధీనం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఈగల్ టీం, జిల్లా పోలీసు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వ ిహిస్తున్నట్లు జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు తెలిపారు. ఈగల్, పోలీసు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు నుంచి విజయవాడ మధ్య ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను బీహార్ నుంచి చైన్నెకి తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ రైల్వేస్టేషన్‌లో కూడా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. గంజాయి ఎక్కువగా రైలులోనే రవాణా అవుతోందని, ఈ గంజాయి నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. గంజాయిని కలిగి ఉన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీఆర్‌పీ సీఐ జే.వి రమణ, ఎస్‌ఎన్‌పురం సీఐ లక్ష్మీనారాయణ, ఆర్‌పీఎఫ్ సీఐ ఫతేఆలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు.