
నిద్రలేమికి అనేక కారణాలు
నేటి యువత ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. నిద్రలేమికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువగా టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు చూడటం, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం, నిద్రలో గురక రావడం, నైట్‌స్లీప్ డిజార్డర్, రక్తహీనత వంటి కారణాలు ఉన్నాయి. నిద్రలేమి ఉన్న వారికి స్లీప్ ల్యాబ్‌లో స్టడీ చేస్తాం. ఆక్సిజన్ శాచురేషన్, బ్రెయిన్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, ఏ సైకిల్‌లో ఉన్నారో తెలుసుకుంటాం. నిద్రలేమికి కారణాలను అంచనా వేసి అవసరమైన వైద్యం చేయడం, సూచనలు ఇవ్వడమో చేస్తుంటాం. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం సరికాదు.
– డి.అనీల్‌కుమార్, న్యూరాలజిస్ట్