
కన్నప్ప.. నా పూర్వజన్మ సుకృతం
సినీనటుడు మోహన్‌బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కన్నప్ప సినిమా తీయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నిర్మాత, నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని మార్పులతో ఈ సినిమా నిర్మించినట్లు ఆయన తెలిపారు. కన్నప్ప చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా బెంజ్ సర్కిల్‌లోని క్యాపిటల్ సినిమాస్‌లో గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నాగ సాధువులు, మాతాజీలతో కలిసి మోహన్‌బాబు ఆ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ కన్నప్ప చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ వచ్చానన్నారు. నాగ సాధువులు, మఠాధిపతులు మాతాజీలను సత్కరించారు. సమావేశంలో నటుడు శివబాలాజీతో పాటు నాగ సాధువులు, పీఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, మాతాజీలు పాల్గొన్నారు.