
లబ్బీపేట(విజయవాడతూర్పు): లేడీ ఓరియేంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి అందరినీ అలరిస్తుందని ఆచిత్ర కథానాయకురాలు హన్సిక అన్నారు. ఈ నెల 17న విడుదల కానున్న ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం నగరానికి విచ్చేసారు. ఈ సందర్భంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్సిక మాట్లాడారు. ఆడవాళ్లకు సంబంధించిన అంశాలతో సినిమా
ఉంటుందన్నారు. విజయవాడ తనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టిన నగరమన్నారు. శృతి క్యారెక్టర్ మంచి పేరును తీసుకొస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ కథకు తగ్గటే హన్సిక నటన అదరగొట్టారని చెప్పారు. తన నిజ జీవితంలో చూసిన కథ ఆధారంగానే ఈ చిత్రం రూపొందించానన్నారు. ఈ సమావేశంలో నిర్మాత రమ్య ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment