
ఇబ్రహీంపట్నం(మైలవరం): జాకీర్ హుస్సేన్ కళాశాల బీకాం విద్యార్థిని లీజు ఖంజా ఖేల్ ఇండియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ మహాబాషా తెలిపారు. ఢిల్లీలోని గౌతమ్‌బుద్ధ యూనివర్సిటీలో మే 28 నుంచి జరుగుతున్న ఖేల్ ఇండియా క్రీడల్లో ఈనెల 31న జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో ప్రతిభ చాటి కాంస్య పతకం సొంతం చేసుకుందని వివరించారు. విద్యార్థులను కేవలం తరగతి గదులకు పరిమితం చేయకుండా వారిలోని ప్రతిభ వెలికితీసేందుకు కళాశాల ముందుంటుందన్నారు. పీడీ హమీద్ ఖాన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు మస్తాన్‌వలి, జాఫర్ సాధిక్, నాగుల్ మీరా హర్షం వ్యక్తం చేశారు.
వైద్య కళాశాలకు మృతదేహం దానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని మొగల్రాజపురానికి చెందిన దావులూరి చిట్టెమ్మ(87) వృద్ధాప్యం కారణంగా గురువారం మృతి చెందారు. ఆమె దేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, మరో కుమార్తె ఉన్నారు. భర్త గతంలోనే చనిపోయారు.
