గుడివాడ టౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు వితరణగా అందజేసినట్లు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పాలడుగు వెంకట్రావు తెలిపారు. డాక్టర్ పెరుమాళ్లు ప్రభావతి జ్ఞాపకార్థం కుమార్తె డాక్టర్ చలసాని లలిత ఈ వితరణ అందజేసినట్లు ఆయన తెలిపారు. సుదీర్గకాలం ఐఎంఏ సభ్యులుగా ఉంటూ పట్టణ ప్రజలకు వైద్య సేవలందించిన డాక్టర్ ప్రభావతి జ్ఞాపకార్థం ఇది అందించండం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉషోదయ ప్రిన్సిపల్ తుమ్మలరత్న, హరిప్రసాద్, కొల్లి పూర్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.