పెట్రోలు సంక్షోభం, చేతులెత్తేసిన ప్రధాని

Sri Lanka PM says economy has collapsed unable to buy oil - Sakshi

కొలంబో: దేశ ఆర్థికవ్యవస్థ చాలా దారుణంగా తయారైందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్‌ కొరతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని స్వయంగా ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో నెలల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని ప్రధాని బుధవారం పార్లమెంటులో చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, పూర్తిగా కుప్పకూలిపోయిందని ప్రధాని విక్రమ సింఘే  ప్రకటించారు. 

పెట్రోలియం కార్పొరేషన్‌ భారీ అప్పుల కారణంగా దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే పనిలో ఉన్న ఆర్థికమంత్రి, ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ఫలితంగా, ప్రపంచంలోని ఏ దేశం లేదా సంస్థ ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదన్నారు. నగదు కోసం ఇంధనాన్ని అందించడానికి కూడా వారు సమ్మతించడం లేదన్నారు.

రెస్క్యూ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చల ఫలితం వచ్చే వరకు ఈ సంవత్సరం తిరిగి చెల్లించాల్సిన 7 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని నిలిపి వేస్తున్నట్లు శ్రీలంక ఇప్పటికే ప్రకటించింది. 2026 నాటికి సంవత్సరానికి సగటున 5 డాలర్లు బిలియన్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులు శ్రీలంకలో ఉన్నారు. దీనిపై జూలై చివరి నాటికి సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమసింఘే తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top