సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Bathukamma Celabrations In Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Oct 9 2021 7:20 PM | Updated on Oct 9 2021 7:26 PM

Bathukamma Celabrations In Singapore - Sakshi

తెలంగాణ క‌ల్చరల్‌ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబ‌ర్ 9న సింగ‌పూర్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో   మిస్ యూనివర్స్ సింగపూర్ 2021గా గెలిచిన తెలుగు అమ్మాయి నందిత బన్నను సొసైటీ సభ్యులు సత్కరించారు. ప్రతీ ఏడూ సుమారు రెండు నుండి మూడు వేల మంది పాల్గొనే ఈ వేడుకల్లో పాల్గొనేవారు. ఈసారి కోవిడ్‌ నిబంధనల కారణంగా వర్చువల్‌గా నిర్వహించారు.   

సుమారు పదమూడేళ్ల నుంచి సింగపూర్ లో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు పండుగ ప్రాముఖ్యతని తెలియజేస్తున్న టీసీఎస్‌ఎస్‌ని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అభినందించారు. ఈ వేడుకలు నిర్వహించడంలో టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నీలం మ‌హేంద‌ర్‌, ‍ప్రధాన కార్యదర్శి బ‌సిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వలతో పాటు కార్యవర్గ సభ్యులు కృషి చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement