ఆర్మూర్‌టౌన్: ఎన్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాకీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి అల్వేని మంగ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఆదివారం ఎస్‌జీఎఫ్ హాకీ అండర్–17, బాల, బాలికల నిజామాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు త్వరలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, సెక్రెటరీ రమణ తదితరులు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కార్యాక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు గడ్డడి రాజేశ్, చిన్నయ్య, నాగేశ్, ఆంజనేయులు, మానస తదితరులు పాల్గొన్నారు.


