నిజామాబాద్ రూరల్: బీఆర్‌ఎస్, బీజేపీలు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, మరోవైపు యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఇప్పటికి మూడుసార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, పదేళ్లలో వారు చేసిన అభివృద్ధి, రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వ పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
తాము రెండున్నరేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ప్రజా ధనాన్ని గోదావరిలో పోశారని, అన్ని తానై వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అసత్యాలు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, పదేళ్ల అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదన్నారు.
2 కోట్ల ఉద్యోగాలు ఎటు వెళ్లినట్లు ?
దేశ యువతకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ మూడుసార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఉమ్మడి జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఎంపీ అరవింద్‌ను ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం వి డ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ ఆస్తులను దోచుకోవాలని ఓ ఎమ్మెల్యే దొంగలా మాట్లాడుతున్నారన్నారు.
కాళేశ్వరం బీటలు వారింది
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్లు వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిందని, రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు.
దొంగే దొంగ అన్నట్లు..
బీజేపీ , బీఆర్‌ఎస్ వాళ్ల వ్యవహారం దొంగనే దొంగదొంగా అన్న చందంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నగర మేయర్ కురగాయాల ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి శేఖర్‌గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ ిసీనియర్ నాయకులు రాం భూపాల్, భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, పోలసాని శ్రీనివాస్, అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల గురించి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు
మాట్లాడటం విడ్డూరం
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు
అష్టకష్టాలు పడ్డారు
అరాచక పాలనను మరిచిపోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో
రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారు
సర్ పేరుతో పేదవాడి ఓటు తొలగించే ప్రయత్నం
మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు
మహేశ్‌కుమార్‌గౌడ్


