అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ హౌస్‌ అరెస్ట్‌

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

● అంకాపూర్‌ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

సుభాష్‌నగర్‌ : అంకాపూర్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణను పోలీసులు సోమవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే స్వల్ప వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా మద్దతు తెలిపేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్‌ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ముందస్తు అరెస్టు

ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డికి మద్దతుగా అంకాపూర్‌ వెళ్లకుండా 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ యాదల నరేశ్‌ను 4వ టౌన్‌ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement