గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో జిల్లావాసులు | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో జిల్లావాసులు

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో జిల్లావాసులు ఇసుక తరలింపునకు అనుమతివ్వండి

నిజామాబాద్‌ అర్బన్‌/ జక్రాన్‌పల్లి: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో జిల్లావాసులు చోటు సాధించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల విక్టరీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గిన్నిస్‌ అచీవర్స్‌ మీట్‌ కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన ఉందింటి విపుల్‌ ఉమీత్‌ రాజ్‌, జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామానికి చెందిన కొట్టం రాజశేఖర్‌ గిన్నిక్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికేట్‌, పతకాన్ని అందుకున్నారు. ఇటీవల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి పర్యవేక్షణలో భారీస్థాయి ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్‌ సంగీత వాయిద్య పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లావాసులు ప్రతిభ చాటి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో సాధించారు.

రామారెడ్డి: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు, సొంత నిర్మించుకునే వారికి ఇసుక, మొరం తరలింపునకు అనుమతి లేక ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతున్నాయని శనివారం తహసీల్దార్‌ ఉమాలత, ఎస్సై రాజశేఖర్‌కు బీజేపీ నేతలు విన్నవించారు. ఈ మేరకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్‌, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్‌, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్‌ పాల్గొన్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్లు అందుకుంటున్న ఉమీత్‌రాజ్‌, రాజశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement