నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని మాజీ జెడ్పీటీసీ మచ్చ నారాగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. బాధిత కుటుంబాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నారాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాగేష్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, బాడ్సి శేఖర్‌గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, దయాకర్‌గౌడ్, సర్పంచ్ మీసాల లక్ష్మినారాయణ, కుద్దూస్ పాల్గొన్నారు.


