సుభాష్‌నగర్: కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పు డు నిజామాబాద్‌కు ఏం చేశావు? మూతపడిన షుగ ర్ ఫ్యాక్టరీలను తెరిపించావా.. ఆర్‌వోబీలు తెచ్చావా... అంటూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లి క్కర్ స్కామ్‌లో వందలు, వేల కోట్లు గడించింది వా స్తవం కాదా? అంటూ ఆరోపించారు. నగరంలో ని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకువస్తుందన్నారు. ఎంపీ అర్వింద్ గురించి కవిత మా ట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో ఎంపీ అర్వింద్ 10 ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేయించారని, వాటిలో ఇప్పటికే మూడు పూ ర్తికాగా, మిగితావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావన్నా రు. ఏప్రిల్ 25న పెట్టబోయే కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ‘ అని పేరు పెట్టుకుంటే సెట్ అవుతుందన్నా రు. కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నారెడ్డి, కల్పే అర్చన, రేవతి న్నారు.
అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్‌లో రూ.కోట్లు గడించావు
కల్వకుంట్ల కవితపై బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి ఆరోపణలు


