నగరంలోని డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డంపింగ్‌యార్డులో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున దుర్వాసనతో పొగ వ్యాపిస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఇదే దుస్థితి ఉంటుందని, అయినా సిబ్బంది ఫైరింజన్లు తెప్పించకుండా మున్సిపల్ కార్మికులతో మంటలను ఆర్పుతున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


