మానవతాసదన్‌ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు | - | Sakshi
Sakshi News home page

మానవతాసదన్‌ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు

Mar 27 2026 9:30 AM | Updated on Mar 27 2026 9:30 AM

మానవతాసదన్‌ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఏఎంసీ అభివృద్ధి పనులకు రూ. 1.57 కోట్లు దంపతుల ఆత్మహత్యాయత్నం

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్‌ పిల్లలకు అగుమెంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌ సహకారంతో పద్మపాణి సొసైటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ స్వచ్ఛంద సంస్థ ల్యాప్‌టాప్‌లు, స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ చేసింది. గురువారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు, సదన్‌లో ఉంటూ చదువుతున్న 70 మంది బాలబాలికలకు స్కూల్‌ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంస్థ ప్రతినిధులు సీఎస్‌ఆర్‌ నిధులను జిల్లాకు ఉపయోగించడం అభినందనీయమన్నారు. అనంతరం మానవతా సదన్‌ విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్‌ ఫ్రేమ్‌ను కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌కుమార్‌, పద్మపాణి సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, అగుమెంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ సామ్యూల్‌ రాజ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ కాశీనాథ్‌, మానవతా సదన్‌ లైజన్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి వ్య వసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో వివిధ అ భివృద్ధి పనుల కోసం ప్ర భుత్వం రూ. 1.57 కోట్లు మంజూరు చేసినట్లు చైర్మన్‌ నర్సయ్య తెలిపారు. మా ర్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్మన్‌ నర్సయ్య అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలను రూపొందించారు. మార్కెట్‌ యార్డులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నిధుల మంజూరు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్‌ రావుకు, కృషి చేసిన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్‌వైజర్‌ రాజు మార్కెట్‌ కమిటీ మూడు నెలల ఆదాయ, వ్యయాలను చదివి వినిపించగా, సభ్యులు ఆమోదించారు. కార్యదర్శి మెర్సీ, వైస్‌ చైర్మన్‌ సుంకెట బుచ్చన్న, మార్కెట్‌ కమిటీ సభ్యులు మహిపాల్‌, లింగారెడ్డి, నవీద్‌, శ్రీనివాస్‌, జీవన్‌, ముత్తెన్న పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బట్టు వినోద్‌, భార్య కవిత గురువారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై మహమ్మద్‌ ఆరీఫ్‌ తెలిపారు. బట్టు బలరాం కొడుకు వినోద్‌ నాలుగు సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బదావత్‌ గేమ్య వద్ద ఓపెన్‌ ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్‌ విషయంలో కొంతకాలంగా గేమ్య కుటుంబంతో గొడవ జరుగుతోంది. వినోద్‌ ఈ ప్లాట్‌లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి బట్టు వినోద్‌కు సంబంధించిన ఆవు బదావత్‌ నాందేవ్‌ ప్లాట్‌లోకి వెళ్లింది. దీంతో నాందేవ్‌ అతని భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు వెళ్లి వినోద్‌, కవితలతో గొడవ పెట్టు కున్నారు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ గొడవ పెట్టుకోవడంతో మనస్థా పానికి గురైన వినోద్‌ అతని భార్య కవిత గుర్తు తెలియని మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే వారిని నిజా మాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు తీసుకున్న మందు ఏమిటన్నదీ తెలియకపోవడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేపోతున్నారని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థి తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వినోద్‌ తండ్రి బలరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement