పార్టీలో కష్టపడిన వారికే పదవులు | - | Sakshi
Sakshi News home page

పార్టీలో కష్టపడిన వారికే పదవులు

Mar 27 2026 9:30 AM | Updated on Mar 27 2026 9:30 AM

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

సుభాష్‌నగర్‌: కాంగ్రెస్‌లో కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు వస్తాయని నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నా రు. కమిటీలో అవకాశం రాని వారిని పార్టీ తప్ప కుండా గుర్తిస్తుందని తెలిపారు. నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గసభ్యులుగా నియమితులైన సభ్యులకు రామకృష్ణ గురువారం నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి నుడా చైర్మన్‌ కేశ వే ణు, సీనియర్‌ నాయకులు నరాల రత్నాకర్‌, జావి ద్‌ అక్రమ్‌ హాజరయ్యారు. అనంతరం బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ పార్టీలో పదవులు పొందిన వారు కాంగ్రెస్‌ బలోపేతం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పదవిని దుర్వినియోగం చేసినట్లయితే క్రమశిక్షణాచర్యలు తప్పవని అన్నా రు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అ ర్బన్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపించి అధిష్టానానికి బహుమతి ఇవ్వాలని ఆకాంక్షించారు. కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను పలు డివిజన్లకు ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, ఎవరి డివిజన్‌లో వారే డివిజన్‌ అధ్యక్షులు, డివిజన్‌ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. నూతనంగా నియమితులైన కార్యవర్గసభ్యులకు త్వరలోనే పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని, శిక్షణకు ప్రతిఒక్కరూ హాజరుకావాలని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పదవి నుంచి తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement