తైబజార్‌ వేలం రూ. 26.34 లక్షలు | - | Sakshi
Sakshi News home page

తైబజార్‌ వేలం రూ. 26.34 లక్షలు

Mar 27 2026 9:30 AM | Updated on Mar 27 2026 9:30 AM

తైబజార్‌ వేలం రూ. 26.34 లక్షలు

బోధన్‌టౌన్‌(బోధన్‌): బోధన్‌ బల్దియా తైబజార్‌ను రూ. 26 లక్షల 34 వేలకు ఖలీం బేగ్‌ దక్కించుకున్నారు. బల్దియా కార్యాలయంలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి గురువారం తైబజార్‌ వేలం నిర్వహించారు. వేలం పాటలో 27 మంది పాల్గొనగా ఖలీంబేగ్‌ అందరి కంటే ఎక్కువ రూ. 26 లక్షల 34 వేలకు తైబజార్‌ను దక్కించుకున్నాడని మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ తెలిపారు. గతంలో తైబజార్‌కు రూ. 23.45 లక్షలు వచ్చాయి.

జంతు వధశాలకు రూ. 10.60 లక్షలు

బల్దియా పరిధిలోని జంతు వధశాలకు నిర్వహించిన వేలంలో 13 మంది పా ల్గొనగా సయ్య ద్‌ షెహజాన్‌ ఖాద్రీ రూ. 10 లక్షల 60 వేలకు దక్కించుకున్నాడు. జంతు వధశాలకు గతంలో రూ. 4 లక్షల 52 వేల ఆదాయం వచ్చిందని కమిషనర్‌ తెలిపారు. వేలంలో మున్సిపల్‌ మేనేజర్‌ సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement