క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 7 2026 2:56 PM | Updated on Feb 7 2026 2:56 PM

క్రైం

క్రైం కార్నర్‌

కుమ్మన్‌పల్లిలో ఒకరి ఆత్మహత్య

బోధన్‌రూరల్‌: సాలూర మండలంలోని కుమ్మన్‌పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఊషం లక్ష్మన్‌ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 5న ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం మృతుడి భార్య మల్లుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పిట్లంలో వ్యక్తి దారుణ హత్య

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురవ్వడం కలకలం రేపింది. జాతీ య రహదారి సర్వీస్‌ రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం ఉదయం ఓ వ్య క్తి రక్తపు మడుగులో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటి యజమానికి, పో లీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు అదే ఇంట్లో పని చేసే యూపీకి చెందిన రాజేష్‌ (46)గా గుర్తించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తిరుపయ్య, ఎస్సై వెంకట్రావ్‌ తెలిపారు.

క్రైం కార్నర్‌1
1/1

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement