పాత డిజైన్‌ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

పాత డిజైన్‌ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మించాలి

Feb 7 2026 2:55 PM | Updated on Feb 7 2026 2:55 PM

పాత డిజైన్‌ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మించాలి

పాత డిజైన్‌ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మించాలి

రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

మంచిప్ప రిజర్వేయర్‌ను పాత డిజైన్‌ ప్రకారమే నిర్మించాలని, తద్వారా ప్యాకేజీ–21 కింద 2వేల ఎకరాలకు నీరు అందుతుందని రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి సీఎం దృష్టికి తీసుకవచ్చారు. అలాగే రూరల్‌ నియోజకవర్గంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గుండారం శివారు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ జోన్‌గా ప్రకటించాలని సీఎంను కోరారు. అదేవిధంగా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టును పున:పరిశీలించాలని, ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఇక్కడ పండే పసుపు, జొన్న ఇతర పంటలకు ఎగుమతి, దిగుమతులకు సులువుగా ఉంటుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఫార్మసిస్ట్‌ కాలేజీలు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు ప్రారంభించాలని కోరారు. జిల్లాను స్మార్ట్‌సిటీగా ప్రకటించాలని, ఆర్టీసీ బస్టాండ్‌, స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణాలకు భూములు, నిధులు కేటాయించాలన్నారు. రామడుగు ప్రాజెక్టు, టెంపుల్‌ కారిడార్‌ కింద రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement