రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ వాలీబాల్ పోటీలు ప్రారంభం
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను సర్పంచ్ హారిక జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎన్.వీ హన్మంత్‌రెడ్డి, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


