రైతును రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
● నిజామాబాద్ రూరల్
ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● అన్నదాతలకు యాంత్రీకరణ
పనిముట్ల పంపిణీ
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వమే రైతును రాజుగా చేసిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాతలకు యాంత్రీకరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ కింద రైతులకు పనిముట్లను అందజేస్తుందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో ఏడు మండలాలకు కలిపి 96 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పనిముట్లను అందించామన్నారు. అనంతరం లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రామ్ చందర్‌గౌడ్, రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


