ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): ఓటు హక్కు పొందిన విద్యార్థులందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ, ఇతరులకు అవగాహన కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో ‘మై ఇండియా–మై వోట్’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు విలువను తెలియజేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి, పీఆర్వో రమణాచారి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ స్వామి, కిషన్, రాథోడ్, గోపిరాజ్, జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, 4ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యూనివర్సిటీ ఆర్ట్స్ డీన్ లావణ్య హాజరై, మాట్లాడారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను విద్య ద్వారా పరిష్కరించవచ్చని సూచించారు. ప్రిన్సిపాల్ రాంబాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ స్వప్న, స్రవంతి పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థినులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.
ఆర్మూర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో అత్యధిక కార్పోరేటర్, కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకొని గులాబి జెండాను ఎగరవేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌ను శనివారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులతోపాటు మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగినట్లు జీవన్‌రెడ్డి వివరించారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ గ్రౌండ్‌లో ఆదివారం అండర్–16 వాలీబాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు తరలివచ్చే బాలబాలికలు తమ పదోతరగతి మెమో, ఆదార్ కార్డులతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు 94407 11635 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి


