ధర నిలకడగా ఉండేనా?
ధరల నియంత్రణపై దృష్టి సారించాలి..
మద్దతు ధర ప్రకటించాలి..
మోర్తాడ్(బాల్కొండ): పసుపు కొనుగోళ్లు మొదలైన ఈ సమయంలో మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ధర నిలకడగా ఉంటేనే పసుపు సాగు చేసిన రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత సీజనులో క్వింటాలుకు పసుపు నాణ్యతను బట్టి రూ.11వేల నుంచి రూ.12 వేల వరకు ధర లభించింది. కొన్ని ప్రత్యేక సందర్బాలలోనే ఒక్కో క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ.18వేల వరకు ధర పలికింది. ఈసారి గతంలో కంటే ఒక్కో క్వింటాలుకు రూ.2వేల ధర పెరిగి రూ.13వేల నుంచి రూ.14వేల వరకూ ధర పలుకుతుంది. ప్రస్తుత ధర ఉన్నా, పెరిగినా తమకు ఎంతో ప్రయోజనం ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 20వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈసారి 20వేల ఎకరాలకు పైగా పసుపును సాగు చేశారు. సాగు విస్తీర్ణం తగ్గడం, గోదాంలు, కోల్డ్ స్టోరేజీలలో పాత పసుపు నిలువలు ఎక్కువగా లేకపోవడం, పొరుగు దేశాలకు ఎగుమతి అవకాశాలు విస్తృతం కావడంతో ఇక్కడి పసుపు పంటకు డిమాండ్ ఏర్పడుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు ధర క్వింటాలుకు రూ.17వేల వరకూ ధర సూచిస్తున్నా.. స్థానిక మార్కెట్‌లో మాత్రం కొంత తేడా ఉంది. పసుపు కొనుగోళ్లలో చేతులు మారడం, నిలువ, రవాణా ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని కమోడిటీలో సూచించిన ధర కంటే తక్కువ ధరనే రైతులకు లభిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే పసుపును ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు తరలించిన సమయంలో ధర తగ్గిపోవడంతో రైతు లకు లాభం తగ్గిపోరయే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్వింటాలుకు రూ.14వేల ధర నిలకడగా ఉంటే ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందనే వాదన ఉంది. మార్కెట్ ఆరంభంలో ఉన్న ధర తగ్గకుండా, అలాగే కొనసాగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేసినట్లు అవుతుందని చెప్పవచ్చు.
ఆరంభంలో ధర ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌కు పసు పు రైతులు అధికంగా తీసుకువస్తారు. దీంతో పంట ఉత్పత్తు లు ఎక్కువగా రావడంతో ధర పడిపోయి, నష్టం కలుగుతుంది. అధికారులు స్పందించి పసుపు ధరల నియంత్రణపై దృష్టిసారించాలి.రైతులకు ఆర్థికంగా లాభం జ రిగితేనే పసుపు సాగు విస్తీర్ణం పెరగడానికి అవ కాశం ఉంది. –గడ్డం లింగారెడ్డి, రైతు, గుమ్మిర్యాల్
పసుపు బోర్డు ఏర్పడినా రైతులకు మద్దతు ధర లభించకపోతే ప్రయోజనం ఏముంటుంది. కేంద్రం స్పందించి పసుపు బోర్డు ఆధ్వర్యంలో మద్దతు ధర ప్రకటించి, అమలు చేయాలి. ధర పడిపోతే రైతులు నష్టపోతా రు. ధరను వ్యాపారులు తగ్గించకుండా చర్యలు తీసుకోవాలి. పసుపు మద్దతు ధర ప్రకటించాలి.
– కుంట రవిశంకర్ రెడ్డి, రైతు, పాలెం
ప్రస్తుత సీజన్‌లో క్వింటాల్ పసుపునకు రూ.14వేలు వరకు పలుకుతున్న వైనం
గతంలో కంటే రూ.2వేలు పెరిగిన ధర
ఇదే పరిస్థితి కొనసాగితేనే తమకు
లబ్ధి అంటున్న రైతులు
ధర నిలకడగా ఉండేనా?
ధర నిలకడగా ఉండేనా?


