మైనారిటీలకు ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వృత్తి శిక్షణ, ఉపాధి కల్పన కోసం అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సు, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ విత్ ఎంఎస్ ఆఫీస్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ విత్ ఎంఎస్ ఆఫీస్, అకౌంటింగ్ ఇన్‌టాక్సేషన్ విత్ ట్యాలీ ప్రైమ్, కోర్సులు అందించనున్నామని, మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఎస్సెస్సీ లేదా ఆపై తరగతి చదివినవారు, 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. వెబ్ డెవెలపర్, డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సైతం అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హులైన వారు దరఖాస్తులను లింక్ ఎడ్యుకేషన్– వెల్ఫేర్ సొసైటీ, నిపుణ్ ఎడ్యుకేషన్ సొసైటీ, యెండల టవర్, నిజామాబాద్‌లోగాని లేదా కలెక్టరేట్‌లోని రూమ్ నెం. 221, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయములో ఈ నెల 31లోపు సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ 97003 51786, 98490 74389ను నిపుణ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫోన్ నెంబర్ 63039 93849ను సంప్రదించాలన్నారు.
డిగ్రీ రీవాల్యుయేషన్ కోసం..
తెయూ (డిచ్ పల్లి): యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (సీబీసీఎస్) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్), రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్స్) థియరీ పరీక్షలకు సంబంధించిన రీవాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ సంపత్ కుమార్‌ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్ ఒక్కో పేపర్‌కు రూ.500లు, ఒక్కో ఫారమ్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వివరించారు.


