నామినేషన్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్
సుభాష్‌నగర్ : మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సూచించారు. శనివారం నగరంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. టీటీడీ కల్యాణ మండపం, వినాయక్‌నగర్ వాటర్ ట్యాంక్ తదితర కేంద్రాలను సందర్శించి వసతుల గురించి టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


