అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
● ప్రజావాణికి 68 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి మొత్తంగా 68 వినతులు వచ్చాయి. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


