ఎరువుల కొరత లేకుండా చూడాలి
బోధన్‌రూరల్: ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్‌కు సంబంధించి కూడా రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. బోధన్ మండలం మావందిఖుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోదాంను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ, ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.


