పంచాయతీ పోరు సమాప్తం
ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్‌లో మూడో విడత పోలింగ్‌తో జిల్లాలో పంచాయతీ పోరు సమాప్తమైంది. డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్, ఆలూ ర్, నందిపేట, డొంకేశ్వర్ మండలాలతోపాటు బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ము ప్కాల్, మెండోర, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, ఏ ర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. ఓటర్లు చలిని లెక్క చే యకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరా రు. ఆర్మూర్, బాల్కొండ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తమ స్వగ్రామాలైన ఆర్మూర్ మండలం అంకాపూర్, వేల్పూర్ మండల కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, ది వ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు ఆసక్తి కనబరిచారు. పలువురు ఆస్పత్రుల నుంచి నేరుగా ఓటు వేసేందుకు రాగా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్స్‌ను అందుబాటులో ఉంచారు. డివిజన్ పరిధిలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 23.35 శాతం, 11 గంటల సమయానికి 54.69 పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 74.36 శాతం ఓటింగ్ కాగా, నిర్ణీత సమయంలోగా క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. 76.45 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మూడో విడతలో మొత్తం 165 సర్పంచ్ స్థానాలకుగాను, 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1620 వార్డు స్థానాలకు గాను 490 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మండలాల వారీగా పోలింగ్ ఇలా..
సత్తా చాటుకున్న కాంగ్రెస్
ఆర్మూర్ డివిజన్‌లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 95, బీఆర్‌ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల గెలుపు
బాల్కొండ నియోజకవర్గంలో కీలకమైన మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్ పాగా
పట్టు నిలుపుకున్న వేముల ప్రశాంత్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కోలుకోలేని ఫలితాలు
అంకాపూర్‌లో ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డికి ఘోర పరాభవం
జిల్లాలో ముగిసిన మూడో విడత
పంచాయతీ ఎన్నికలు
చలిని లెక్క చేయకుండా పోలింగ్
కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
పోలింగ్ 76.45 శాతం నమోదు
పంచాయతీ పోరు సమాప్తం
పంచాయతీ పోరు సమాప్తం
పంచాయతీ పోరు సమాప్తం
పంచాయతీ పోరు సమాప్తం


