ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఆర్మూర్‌టౌన్: ఉమ్మడి జిల్లా హాకీ జట్టును పట్టణంలోని మినీస్టేడియంలో బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. ఈనెల 20న రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీల్లో ఎంపికై న జట్టు పాల్గొంటుందని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అంజు, హాకీ క్రీడాకారులు శ్రీను, వెంకేటేశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నారంలో ఉద్రిక్తత
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతా వరణం ఏర్పడింది. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారనే ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ప్రచారంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో గుమిగూడిన వారిని లాఠీలతో చెదరగొట్టారు. గొడవ వాతావరణం ఏర్పడడంతో పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. బుధవారం రోజంతా పోలీసులు గ్రామంలోనే ఉన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్‌రూరల్ సీఐ శ్రీనివాస్ ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
డ్రాలో గెలిచిన
బీజేపీ సర్పంచ్ అభ్యర్థి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని కంఠంలో కాంగ్రెస్ బలపర్చిన పెంట ఇంద్రు డు, బీజేపీ బలపరిచిన అజిగిరి సాయి నాథ్‌కు సమానంగా 711 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రా ద్వారా విజేతగా అజిగిరి సాయినాథ్‌ను రిటర్నింగ్ అధికారి జాన్ విల్సన్ ప్రకటించారు. కౌంటింగ్ తరువాత సాయినాథ్‌కు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. పెంట ఇంద్రుడు రీ కౌంటింగ్ కోరారు. ఓట్లు మళ్లీ లెక్కించగా సాయినాథ్ కు వచ్చిన ఒక్క ఓటు తప్పుడు మడతతో రెండు గుర్తులకు సిరా మరక అంటింది. ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు ఆ ఓటు రద్దు చేశారు. దీంతో ఇరువురికి 711 ఓట్లు సమానంగా వచ్చాయి. లక్కీ డ్రాలో సాయినాథ్ పేరు వచ్చింది.
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక


