ప్రజాస్వామ్య సేవకులు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టత కోసం తమ వంతు సేవలందించి ఆదర్శంగా నిలిచారు. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో 1,100 మంది వివిధ విభాగాలకు చెందిన పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. అయితే వారు బందోబస్తుకే పరిమితం కాకుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు ఇలా తమ వంతు సహకారం అందించారు. పోలీసు సిబ్బందిని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. – ఆర్మూర్
ప్రజాస్వామ్య సేవకులు..


