ఓటేసేందుకు విదేశాల నుంచి..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పలువురు పుట్టి పెరిగిన పల్లెలో ఓటేసేందుకు వచ్చారు. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్‌కు చెందిన దంపతులు మోహన్‌గాంధీ, మౌనికారెడ్డి అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నారు. అదే గ్రామానికి మరో యువకుడు పోలాండ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నికలు ఉన్నాయని సమాచారం అందడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో గర్వంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటిచెప్పారు. – డొంకేశ్వర్(ఆర్మూర్)
ఓటేసేందుకు విదేశాల నుంచి..


