మూడో విడతకు ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఈ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ చేపట్టారు. ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలను మినహాయించి మిగిలిన స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు మండలం వారీగా పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, నోడల్ అధికారి పవన్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.
మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట అటవీ ప్రాంతంలో ఆవులను మేపుతున్న ఒకరిపై సోమవారం చిరుత దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని చిన్నగుట్ట తండాకు చెందిన అశోక్ గ్రామంలోని కెతావత్ యాదగిరికి చెందిన ఆవులను రెండేళ్లుగా మేపుతున్నాడు. రోజూవారీలాగే సోమవారం కూడా మేత కోసం తోలుకొని వెళ్లాడు. ఆవులను మేపుతుండగా పొదల్లో దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుక నుంచి వీపుపై పంజా విసిరింది. అప్రమత్తమైన అశోక్ అరవడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి పరుగెత్తింది. ఘటనలో అశోక్‌కు స్వల్పంగా గాయమైంది. అటవీశాఖ సెక్షన్ అధికారులకు సమాచారమిచ్చారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా శ్రావణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మేనేజర్ శ్రీనివాస్, ఆర్వో ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ తోపాటు సిబ్బంది నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సుభాష్‌నగర్: సెలవుపై వెళ్లిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత నెల 19వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఆయన దీర్ఘకాలిక సెలవులో ఉండగా, ఇన్‌చార్జి కమిషనర్‌గా అదనపు కలెక్టర్ అంకిత్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 25 రోజుల తరువాత విధుల్లో చేరిన కమిషనర్ అభివృద్ధి పనులు, టౌన్‌ప్లానింగ్, ఇతర విభాగాల పనితీరుపై సమీక్షించారు.
ఆర్మూర్: రష్యాలో నెలకు రూ.70 వేల వేతనంతో ఉ ద్యోగాలు ఇప్పిస్తామని కొందరు నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రవాస భార తీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అఽ ద్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అ న్నారు. మామిడిపల్లిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులో మా ట్లాడారు. మెండోర మండలం వెల్కటూర్‌కు చెందిన వెంకటేశ్ అనే యువకుడిని నందిపేట్‌కు చెందిన నకిలీ ఏజెంట్ మోసం చేసి రూ.3 లక్షలు తీసుకొని విజిట్ వీసాపై రష్యా కు పంపించాడన్నారు. తీరా అక్కడ ఏజెంట్ చెప్పిన స్థాయిలో ఉద్యోగం, వేతనం లేకపోవడంతో బాధితుడు 15 రోజుల్లో స్వగ్రామానికి తిరిగి వచ్చి తమ సంస్థను ఆశ్రయించాడన్నారు. నకిలీ ఏజెంట్‌ను పిలిపించి రష్యాకు వెళ్లి రావడానికి రూ.లక్ష ఖర్చు పోను మిగిలిన రూ.2 లక్షలను బాధితుడికి ఇప్పించామన్నారు. ఇప్పటికై నా నిరుద్యోగ యువత నకిలీ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
మూడో విడతకు ర్యాండమైజేషన్ పూర్తి
మూడో విడతకు ర్యాండమైజేషన్ పూర్తి


