మహిళా ఓటర్లే కీలకం
● ఆర్మూర్ డివిజన్ పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది అధికం
ఆర్మూర్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఆర్మూర్ డివిజన్‌లోని గ్రామాల్లో గెలిచేందుకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే వారి జయాపజ యాలను ప్రభావితం చేసేది మాత్రం మహిళా ఓటర్లే! మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంతోపాటు మహిళా సంఘాలను తమ వైపు తిప్పుకొని ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఆర్మూర్ 14,155 16,660 01 30,816
ఆలూర్ 9,400 11,292 00 20,692
నందిపేట 19,416 22,835 03 42,254
డొంకేశ్వర్ 7,696 9,064 00 16,760
బాల్కొండ 12,012 13,919 00 25,931
ముప్కాల్ 7,443 8,730 00 16,173
మెండోర 9,797 11,385 01 21,183
వేల్పూర్ 14,688 17,466 00 32,154
భీమ్‌గల్ 18,183 21,087 01 39,271
మోర్తాడ్ 12,740 14,903 00 27,643
ఏర్గట్ల 5,233 6,096 00 11,329
కమ్మర్‌పల్లి 13,824 16,061 00 29,885
మొత్తం 1,44,587 1,69,498 6 3,14,091


