ఓటేసే అవకాశం కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్
మోపాల్: మండలంలోని మంచిప్పకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ కెతావత్ ప్రవీణ్ ఓటేసే అవకాశం కోల్పోయాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సెలవులో స్వగ్రామానికి విచ్చేసిన ప్రవీణ్ ఆదివారం ఓటేయకుండా వెనుదిరిగాడు. ఆయన కథనం ప్రకారం.. ప్రవీణ్ రాజమండ్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. డిసెంబర్ 6న పంచాయతీ కార్యాలయ సిబ్బంది పోస్టల్ ఓటు కోసం ఫోన్ చేశారు. తనకు సెలవు మంజూరైందని, ఓటేసేందుకు స్వగ్రామానికి వస్తున్నానని సమాధానమిచ్చాడు. పోస్టల్ ఓటు వద్దని చెప్పాడు. అయినప్పటికీ రాజమండ్రిలో కార్యాలయ అడ్రస్ ఇవ్వాలని కోరగా, అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్‌ను పంచాయతీ సిబ్బంది కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. దీంతో ప్రవీణ్‌కు పోస్టల్ ఓటు విడుదలైంది. డిసెంబర్ 13న రాజమండ్రిలోని కార్యాలయానికి చేరినట్లు తోటి ఉద్యోగులు ఫోన్ ద్వారా తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆలస్యంగా రావడమే కాకుండా రిటర్న్ వచ్చేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాను నిరాకరించినా.. పోస్టల్ ఓటు ఇష్యూ కావడంతో తాను ఓటేసే అవకాశం కోల్పోయానని ప్రవీణ్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ విషయమై ఎంపీడీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఒకసారి పోస్టల్ ఇష్యూ అయితే ఏమీ చేయలేమని వివరించారు. కాగా తాను పోస్టల్ ఓటు వద్దన్నా.. ఇష్యూ కావడానికి గ్రామ, మండల అధికారులే కారణమని ప్రవీణ్ వాపోయాడు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్‌బంక్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోల్‌బంక్ క్యాబిన్‌లోకి ప్రవేశించాడు.అందులో పనిచేస్తున్న వ్యక్తి నిద్రపోతున్న సమయంలో తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లి రూ.లక్ష నగదును దోచుకుంటున్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మండలం సంగం గ్రామానికి చేందిన రొడ్డ సుచరిత పొలిటిక్‌ల్ సైన్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంది. పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత పర్యవేక్షణలో ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్, ఏస్టీడీ ఆన్ నిజామాబాద్ జిల్లా అనే అంశంపై సుచరిత చేసిన అధ్యాయనానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. తల్లి, భర్త కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను డాక్టరేట్ సాధించానని సుచరిత తెలిపింది.
ఓటేసే అవకాశం కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్


