కాంగ్రెస్‌దే హవా.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌దే హవా..

Dec 15 2025 10:12 AM | Updated on Dec 15 2025 10:12 AM

కాంగ్

కాంగ్రెస్‌దే హవా..

డిచ్‌పల్లి మండలం ధర్మారంలో ఓటు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. మెజార్టీ సర్పంచ్‌ స్థానాలు హస్తం ఖాతాలోకి చేరాయి. ఏకగ్రీవ స్థానాలను మినహాయించి 158 గ్రామాల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు 101 గ్రామాల్లో, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 24 గ్రామాల్లో, బీజేపీ మద్దతుదారులు 15 గ్రామాల్లో, స్వతంత్రులు 18 గ్రామాల్లో విజయం సాధించారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధి కార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు తమ హవాను కొనసాగించారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన పోలింగ్‌లో కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను గెలుచుకున్నా రు. ఈ విడతలో మొ త్తం 8 మండలాల్లోని 196 పంచాయతీ సర్పంచ్‌ల కు గాను 38 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 158 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఈ పంచాయతీల్లో మొత్తం వార్డు స్థానాలు 1,760 ఉండగా, 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 674 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,081 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 1,476 పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించినట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

● మాక్లూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, డిచ్‌పల్లి, మో పాల్‌, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు జరిగిన పోలింగ్‌లో 76.71 శాతం పోలింగ్‌ నమోదైంది. చలి తీవ్రతతో మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్‌ తరువాత వేగం పుంజుకుంది.

● డిచ్‌పల్లి మండలం ధర్మారంలో పోలింగ్‌ బూత్‌ వద్ద ఒక అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడంటూ ప్రత్యర్థి వర్గం అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో పాటు ఆందోళన చేశారు. ఇందల్వా యి మండలం సి ర్నాపల్లిలో ఒక అ భ్యర్థి దొంగ ఓ ట్లు వేయిస్తున్నాడంటూ మరో వర్గం అ భ్యర్థి గొడవ చేయడంతో అదనపు డీసీపీ బ స్వారెడ్డి, ఏసీపీ రా జావెంకటరెడ్డి గ్రా మానికి చేరుకుని వి చారణ చేయిస్తామన్నారు.

● పోలింగ్‌ అనంతరం లెక్కింపు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 133, బీజేపీ 17, బీఆర్‌ఎస్‌ 26, స్వతంత్రులు 20 మంది సర్పంచ్‌ అభ్యర్థులు గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

పకడ్బందీ పర్యవేక్షణ..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి వినయ్‌ కష్ణారెడ్డి మోపాల్‌, డిచ్‌పల్లి మండలాల్లోని ముల్లంగి, ధర్మా రం పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. హెల్ప్‌ డెస్క్‌లు, మెడికల్‌ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. వృద్ధు లను తరలించేందుకు వీల్‌చైర్లు వినియోగిస్తున్నారా లేదా అని గమనించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మొహరించామన్నారు. వెబ్‌ క్యాస్టింగ్‌ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లతో పోలింగ్‌ తీరును నిశితంగా పరిశీలించామన్నారు. కలెక్టరేట్‌ నుంచి సైతం పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగిందని, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. మరోవైపు ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యాంప్రసాద్‌లాల్‌ సైతం పోలింగ్‌ కేంద్రాలను విస్తృతంగా సందర్శించి, ఓటింగ్‌ తీరుతెన్నులను పరిశీలించారు. మోపాల్‌, మాక్లూర్‌, గుండారం, డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌, ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి, సిరికొండల్లో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఓటింగ్‌ తీరుతెన్నులు పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య డిచ్‌పల్లి, మోపాల్‌, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ, ఽమాక్లూర్‌, ధర్పల్లి మండలాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

మండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం 9గంటల వరకు 11 గంటల వరకు ఒంటి గంట వరకు పోలైన మొత్తం

ఓటర్లు పోలైన ఓట్లు పోలైన ఓట్లు పోలైన ఓట్లు మొత్తం ఓట్లు పోలింగ్‌ శాతం

ధర్పల్లి 13,449 15,570 –– 29,019 6,092 15,550 19,821 21,049 72.54

డిచ్‌పల్లి 20,129 23,253 –– 43,382 5,866 15,339 27,190 33,111 76.32

ఇందల్వాయి 13,589 15,668 01 29,258 5,836 14,761 22,028 22,054 75.38

జక్రాన్‌పల్లి 14,427 16,839 –– 31,266 7,191 17,247 22.763 23,471 75.07

మాక్లూర్‌ 11,821 13,844 –– 25,665 5,725 14,436 19,674 20,255 78.92

మోపాల్‌ 13,342 15,720 –– 29,062 5,646 16,033 22,945 23,031 79.25

ని.రూరల్‌ 9,276 10,361 04 19,641 5,242 11,839 15,806 15,806 80.47

సిరికొండ 14,894 16,651 –– 31,545 7,331 12,143 23,069 24,442 77.48

మొత్తం 1,10,927 1,27,906 05 2,38,838 48,929 1,17,348 1,73,296 1,83,219 76.71

ఫలితాలు ఇలా..

జీపీలు కాంగ్రెస్‌ ఏకగ్రీవం కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం బీఆర్‌ఎస్‌ బీజేపీ ఏకగ్రీవం బీజేపీ స్వతంత్రులు ఏకగ్రీవం స్వతంత్రులు

196 32 101 02 24 02 15 02 18

సింగిల్‌ డిజిట్‌తో విజయం..

సిరికొండ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్‌ బలపర్చిన మల్లెల సాయిలు ఒక్క ఓటుతో గెలుపొందారు.

ఇందల్వాయి మండలం రూప్లానాయక్‌తండా సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలర్చిన హరిసింగ్‌ 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మోపాల్‌ మండలం ఒడ్డెర కాలనీ సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపర్చిన సుమలత 8 ఓట్లతో గెలుపొందారు.

రెండో విడత పోలింగ్‌ వివరాలు..

వివిధ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు

రెండో విడతలో అత్యధిక పంచాయతీలలో కాంగ్రెస్‌ మద్దతుదారుల విజయం

మొత్తం 196 జీపీల్లో 38 ఏకగ్రీవం,

158 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు

76.71 శాతం పోలింగ్‌ నమోదు

పర్యవేక్షించిన కలెక్టర్‌, సీపీ, సాధారణ ఎన్నికల పరిశీలకుడు

లక్కీ విజేతలు

ఒడ్డెర కాలనీ గ్రామపంచా యతీలో 2, 5వ వార్డులో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఆలకుంట వెంకమ్మ, దండుగుల ప్రమీల లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు.

కాంగ్రెస్‌దే హవా..1
1/5

కాంగ్రెస్‌దే హవా..

కాంగ్రెస్‌దే హవా..2
2/5

కాంగ్రెస్‌దే హవా..

కాంగ్రెస్‌దే హవా..3
3/5

కాంగ్రెస్‌దే హవా..

కాంగ్రెస్‌దే హవా..4
4/5

కాంగ్రెస్‌దే హవా..

కాంగ్రెస్‌దే హవా..5
5/5

కాంగ్రెస్‌దే హవా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement