రెబల్స్‌ గుబులు | - | Sakshi
Sakshi News home page

రెబల్స్‌ గుబులు

Dec 14 2025 12:07 PM | Updated on Dec 14 2025 12:07 PM

రెబల్

రెబల్స్‌ గుబులు

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

వాతావరణం

ఉదయం శీతల గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.

ప్రజల దృష్టి మళ్లించేందుకే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించిందని

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు.

ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 8లో u

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌అర్బన్‌: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసేవిధంగా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని, కౌంటింగ్‌ ప్ర క్రియ సజావుగా నిర్వహించాలన్నారు. తగి నంత సిబ్బందిని కేటాయించాలన్నారు. వీసీ లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్‌లాల్‌, వ్యయ పరిశీలకులు కిషన్‌ తదిరులు పాల్గొన్నారు.

రోడ్డుపైనే మేకల క్రయవిక్రయాలు

నవీపేటలో ట్రాఫిక్‌కు అంతరాయం

నవీపేట : నవీపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే మేకల సంతతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. మార్కెట్‌ ప్రాంగణం సరిపోకపోవడంతో బాసర రహదారి పక్కనే రోడ్డుపై క్రయవిక్రయాలు జరుపుతున్నారు. వాహనాలు అక్కడే నిలిపి బేరసారాలు కొనసాగిస్తున్నారు. కొద్ది దూరంలో రైల్వేగేటు ఉండడంతో గేటు వేసిన సమయంలో ట్రాఫిక్‌కు మరింత ఇబ్బంది ఎదురవుతోంది. పోలీసులు వ్యాపారులను హెచ్చరించినా వినడం లేదు.

వ్యాన్‌ అద్దాలు

పగులగొట్టి, రూ. 2.20 లక్షలు అపహరణ

నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన సంతకు వచ్చిన మేకల వ్యాపారికి చెందిన రూ. 2.20 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ధర్పల్లి మండలం రామడుగుకు చెందిన అబ్దుల్‌ ఖయ్యూమ్‌ తన వ్యాన్‌లో మేకలను తీసుకుని సంతకు వచ్చాడు. స్థాని క మెస్‌లో భోజనం చేసేందుకు వ్యాన్‌ను రోడ్డు పక్కన నిలిపి హోటల్‌లోకి వెళ్లాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వ్యాన్‌ అద్దాలు పగులగొట్టి అందు లోని రూ.2.20 లక్షలను ఎత్తుకెళ్లారు. అద్దం పగిలిన శబ్దం విని ఖయ్యూమ్‌ అక్కడికి రాగా దుండగులు పారిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రేపటి నుంచి విశ్రాంత ఉద్యోగుల క్రీడాపోటీలు

నిజామాబాద్‌ రూరల్‌: అఖిల భారత పెన్షన ర్స్‌ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17 వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అ ధ్యక్షులు పండరినాథ్‌ ఒక ప్రకటనలో తెలి పారు. పోటీలు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంతోపాటు ఆఫీసర్స్‌ క్లబ్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల పా టు క్రీడాపోటీలు సాగుతాయన్నారు. 17న ముగింపు కార్యక్రమాన్ని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహిస్తామని తెలిపారు.

చైనా మాంజా

వినియోగిస్తే చర్యలు

నిజామాబాద్‌అర్బన్‌: చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీ పీ సాయి చైతన్య ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాంజా కారణంగా ఎవరి ప్రాణాలకై నా హాని కలిగితే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా కారణంగా జంతువులకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. మాంజా అమ్మినా, తయారు చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచే రెబల్స్‌ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే కీలకమైన పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ప్రస్తుతం జరుగనున్న రెండో విడత, మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులకు రెబల్స్‌ గుబులు పట్టుకుంది.

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మోపాల్‌ మండలంలోని అమ్రాబాద్‌ గ్రామపంచాయతీ ఏర్పడిన 45 ఏళ్లలో రెండోసారి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీలో ఇప్పటికే ఏడుసార్లు ఏకగ్రీవమైంది. నిజామాబాద్‌ ఉమ్మడి మండలంలోని మంచిప్ప గ్రామపంచాయతీ నుంచి అమ్రాబాద్‌ (ఎల్లమ్మకుంటను కలుపుకుని) పంచాయతీ గా ఏర్పాటైంది. మొదటిసారి మోజీరాం నాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1986 సంవత్సరంలో ఎన్నికలు జరగ్గా మోజీరాం నాయక్‌ విజయం సాఽ దించారు. 1995 వరకు మోజీరాం ఏకగ్రీవ సర్పంచిగా పని చేశారు. ఆ తర్వాత వరుసగా బొట్టు శంకర్‌, ఈశ్వర్‌ సింగ్‌ నాయక్‌, కెతావత్‌ యాదగిరి నాయక్‌, సంజీవ్‌ గౌడ్‌, గోకుల్‌ సింగ్‌ ఏకగ్రీవ సర్పంచులుగా పనిచేశారు. 2019లో అమ్రాబాద్‌ నుంచి ఎల్లమ్మకుంట ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటైంది. 1986 తర్వాత మళ్లీ 2025వ సంవత్సరంలో అమ్రాబాద్‌లో పోటీ నెలకొంది. ఎస్టీ మహిళకు ఆ పంచాయతీ రిజర్వ్‌ కావడంతో ఏకంగా 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1986వ సంవత్సరంలో మోజీరాంనాయక్‌పై పోటీ చేసిన ఈశ్వర్‌సింగ్‌ నాయక్‌.. తాజా ఎన్నికల్లోనూ పోటీ పడుతున్న 8 మంది అభ్యర్థుల్లో ఆయన భార్యను బరిలో నిలపడం గమనార్హం.

పలు గ్రామపంచాయతీలలో అభ్యర్థుల నడుమ పోటీ హోరాహోరీగా ఉంది. మండల కేంద్రాలతో పాటు కొన్ని పెద్ద గ్రామాల్లో త్రిముఖ, మరికొన్ని గ్రామాల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఆయా మండలాల్లోని నడిపల్లి, డిచ్‌పల్లి, ధర్మారం(బి), ఇందల్వాయి, నల్లవెల్లి, గన్నారం, మెగ్యానాయక్‌ తండా, ఎల్లారెడ్డి పల్లి, సిర్నాపల్లి, రేకులపల్లి, దుబ్బాక్‌, హోన్నాజిపేట్‌, రామడుగు (ప్రాజెక్టు), ధర్పల్లి,మోపాల్‌,కంజర, న్యాల్‌కల్‌, అమ్రాబాద్‌, సింగంపల్లి, జక్రాన్‌పల్లి, పడకల్‌, కలిగోట్‌, బ్రాహ్మణపల్లి, అర్గుల్‌, సికింద్రాపూర్‌, గడ్కోల్‌, సిరికొండ, న్యావనంది, రావుట్ల, కొండూర్‌, గుండారం, ఆకుల కొండూర్‌, జలాల్‌పూర్‌, మల్లారం తదితర గ్రామాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భారీ ఎత్తున ఖర్చు చేశారు. ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్‌ పదవితో పాటు వార్డుల్లోనూ గట్టి పోటీ నెలకొంది.

డిచ్‌పల్లి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

డిచ్‌పల్లి సెంటర్‌లో సూచనలిస్తున్న ఆర్డీవో రాజేంద్రకుమార్‌

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది

45 ఏళ్లలో రెండో ఎన్నిక

అమ్రాబాద్‌ గ్రామ పంచాయతీలో

రికార్డు ఏకగ్రీవాలు

పలు గ్రామాల్లో పోటాపోటీ..

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓటర్లు..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మూడు ప్రధాన పార్టీ ల ప్రాబల్యం కలిగిన జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పా ర్టీ మద్దతుదారులు ఆధిపత్యం సాధించినప్పటికీ, రాబోయే కాలంలో రాజకీయ సమీకరణల్లో అనూ హ్య మార్పులకు సంకేతాలు కలిగించాయి.

బోధన్‌ డివిజన్‌లోని బోధన్‌, బాన్సువాడ ని యోజకవర్గాల పరిధిలో పలుచోట్ల వెలువడిన ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. చాలాచోట్ల కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే పోటాపోటీగా తలపడ్డారు. బా న్సువాడ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో అయితే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గాల మధ్య పంచాయతీ పోరు నడిచింది. ఈ పోరులో పోచారం వర్గీయులే ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. కాగా కొన్ని కీలకమైన చోట్ల మా త్రం పోచారం, ఏనుగు వర్గాలు కలసికట్టుగా పోటీ చేసినప్పటికీ బీజేపీ మద్దతుదారులు విజయం సాధించడం విశేషం. ఇదిలా ఉండగా రెండో, మూ డో విడతల్లోనూ అధికార పార్టీకి ఈ రెబెల్స్‌ బెడద ఎక్కువగానే ఉండడంతో గుబులు పుట్టిస్తోంది.

మోస్రా మండల కేంద్రంలో పోచారం, ఏనుగు వర్గీయులు కలిసే బరిలోకి దిగినప్పటికీ ఇక్కడ బీ జేపీ మద్దతుదారుడు గెలుపొందడం గమనార్హం. అదేవిధంగా మరో మండల కేంద్రమైన పొతంగల్‌ పంచాయతీలోనూ ఇరువర్గాలు కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ మద్దతుదారుడు విజయం సాధించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రుద్రూర్‌ మండలం అంబం గ్రామపంచాయతీ లో పోచారం, ఏనుగు వర్గీయులు ఎవరికి వారు గా బరిలోకి దిగగా ఇద్దరూ ఓటమిపాలయ్యారు. ఇక్క డ బీజేపీ మద్దతుదారుడు విజయం సాధించారు.

చందూర్‌లో త్రిముఖ పోరు జరుగగా కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులు ఓటమిపాలు కాగా, బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు గెలుపొందారు.

రుద్రూర్‌ మండలం చిక్కడపల్లిలో పోచారం, ఏనుగు వర్గీయులు విడివిడిగా పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

మోస్రా మండ లం తిమ్మాపూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదా రులు ఓడిపోగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వర్ని మండలం పైడిమల్ల పంచాయతీలో పోచారం వర్గీయుడు ఓడిపోగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు.

రుద్రూర్‌ మండలం సులేమాన్‌ ఫారం, రాణంపల్లి, వర్ని మండలం సత్యనారాయణపురం, హు మ్నాపూర్‌, జాకోరా, జలాల్‌పూర్‌, నెహ్రూనగర్‌ గ్రా మ పంచాయతీల్లో, మోస్రా మండలం చింతకుంట పంచాయతీలో పోచారం, ఏనుగు వర్గీయులు ఎవరికివారు పోటీ చేయగా పోచారం మద్దతుదారులు గెలుపొందారు.

రుద్రూర్‌ మండలం రాయకూర్‌ క్యాంప్‌, వర్ని మండలం కునిపూర్‌ గ్రామపంచాయతీల్లో ఏనుగు వర్గీయులు గెలుపొందారు.

రుద్రూర్‌ మండల కేంద్రంలో పోచారం వర్గానికి చెందిన వసంత సంజీవరెడ్డి ఓడిపోగా, ఏనుగు వ ర్గానికి చెందిన సునీత చంద్రశేఖర్‌ గెలుపొందారు.

బోధన్‌ నియోజకవర్గం పరిధిలోని ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీపడగా వాళ్లు ముగ్గురూ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కందిగట్ల రాంచందర్‌ విజయం సాధించారు.

నవీపేట మండలం జన్నేపల్లి పంచాయతీలో కాంగ్రెస్‌ నుంచి అన్నదమ్ములు రచ్చ సుదర్శన్‌, రచ్చ నర్సయ్య బరిలో నిలవగా ఇద్దరూ ఓడిపోయా రు. బీజేపీ అభ్యర్థి గంగాధర్‌ గెలుపొందారు.

నవీపేట మండలంలోని నాళేశ్వర్‌లో కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, స్టేషన్‌ ఏరియాలో ఇద్దరు, రాంపూర్‌లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్‌ మద్దతుదారులు నిలబడ్డారు. వీటిలో కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలుపొందారు.

రెంజల్‌ మండలం కందకుర్తి, అంబేద్కర్‌నగర్‌ పంచాయతీల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు నిలబడ్డారు. వీటిలో కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలుపొందారు.

బోధన్‌ మండలంలోని సిద్ధాపూర్‌, రాంపూర్‌, బిక్నెల్లి, ఊట్‌పల్లి, పెంటాకూర్‌ పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఇద్దరు చొప్పున నిలబడ్డారు. వీటిల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలుపొందారు. ఇదే మండలంలోని బండారుపల్లి పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఇద్దరు బరిలో నిలవగా బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు గెలుపొందారు.

సాలూర మండలంలోని తగ్గెలి పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుదారులు ముగ్గురు బరిలో నిలవగా ఈ ముగ్గురూ ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అరుణ గెలుపొందారు. ఖాజాపూర్‌ పంచాయతీలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు పోటీచేయగా ఇద్ద రూ ఓడారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు గెలుపొందారు. సాలంపాడ్‌ క్యాంప్‌ పంచాయతీలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు పోటీచేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ మద్దతుదారుడే గెలిచారు. హున్సా పంచాయతీలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు బరిలో నిలవగా, కాంగ్రెస్‌ మద్దతుదారుడు గెలుపొందారు.

రెండో, మూడో విడత పంచాయతీ

ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌

మద్దతుదారుల్లో అంతర్మథనం

మొదటి విడత ఎన్నికల్లో ట్రబుల్స్‌ను

అధిగమించిన అధికార పార్టీ

కీలకమైన పంచాయతీల్లో

బీజేపీ మద్దతుదారుల పాగా

రెబల్స్‌ గుబులు 1
1/4

రెబల్స్‌ గుబులు

రెబల్స్‌ గుబులు 2
2/4

రెబల్స్‌ గుబులు

రెబల్స్‌ గుబులు 3
3/4

రెబల్స్‌ గుబులు

రెబల్స్‌ గుబులు 4
4/4

రెబల్స్‌ గుబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement