రెండో విడత పోలింగ్‌కు వేళాయే !
● 158 సర్పంచ్, 1081 వార్డులకు ఎన్నికలు
● 38 సర్పంచ్, 674 వార్డులు ఏకగ్రీవం
● పోలింగు కేంద్రాలకు చేరిన సిబ్బంది
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ఆదివారం ఉ దయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వర కు జరుగనుంది. మధ్యా హ్నం 2 గంటల నుంచి ఓ ట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట వార్డు స భ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్ల లె క్కింపు చేస్తారు. మొదటి విడతలో పెద్ద గ్రామాల్లో కౌంటింగ్ ఆలస్యమైంది. ఈ సారి కౌంటింగులో ఆ లస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
రెండో విడతలో నిజామాబాద్ డివిజన్‌లోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మో పాల్, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలాల్లోని 196 పంచాయతీలు, 1,760 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 38 గ్రామాల్లో సర్పంచ్ పదవులు, 674 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 158 సర్పంచ్, 1,081 వార్డులకు పోలింగు జరుగుతుంది. 158 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీ పడుతున్నారు. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగు సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో శనివారం పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆయా మండలాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
రెండో విడత పోలింగ్‌కు వేళాయే !


