నేటితో పంచాయతీ ప్రచారానికి తెర
● ముగియనున్న మూడో విడత ప్రచారం
● 17న పోలింగ్.. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
ఆర్మూర్/మోర్తాడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ జరుగనున్న గ్రా మాల్లో నేటితో ప్రచారానికి తెరప డనుంది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధి లోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 12 ఆర్మూర్, ఆ లూర్, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, మెండోర, ము ప్కాల్, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, ఏ ర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాల్లో ఏకగ్రీవ స్థానాలను మినహాయించి 146 సర్పంచ్, 1135 వార్డు స్థా నాలకు ఈనెల 17వ తేదీన పోలింగ్ జర గనుంది. ఇందుకు అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తోంది. సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 163 అమలు
పోలింగ్ జరనున్న గ్రామాల్లో సోమవారం సా యంత్రం 5 గంటల నుంచి భారతీయ న్యా య సంహిత (బీఎన్‌ఎస్) 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తె లిపారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండొద్దని హెచ్చరించారు. 17వ తేదీన పోలింగ్, కౌంటింగ్ పూ ర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు.


