ధర్మారంలో ఉద్రిక్తత
● పోలింగ్ కేంద్రంలోకి
చొచ్చుకు వచ్చిన పలువురు
● చెదరగొట్టిన పోలీసులు
డిచ్‌పల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉ ద్రి క్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం లోపల ఉండి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మరో సర్పంచ్ అభ్యర్థి, అతడి మద్దతుదారులు అందోళనకు దిగారు. ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలో ని చొచ్చుకురావడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని సముదాయించడానికి యత్నించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రం నుంచి వారిని దూరంగా చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రంలోపల అభ్యర్థులు ఎవరూ ఉండవద్దని హెచ్చరించి అందరినీ బయటకు వెళ్లగొట్టారు. సమాచారం అందుకున్న ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ధర్మారం(బి) పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.


