ఆలోచించి ఓటు వేసేలా...
మోర్తాడ్: ఓటు అనే ఆయుధంను మీ చేతికి ఇచ్చాను.. పోరాడి రాజులు అవుతారో... ఆ ఓటును అమ్ముకుని బానిసలుగా మారుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది... అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అలనాడు చెప్పిన సూక్తిని మరోసారి గుర్తుకు తెచ్చారు ప్రజాస్వామ్యవాదులు. పంచాయతీ ఎన్నికల వేళ ఏర్గట్ల మండలం తొర్తిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని ఆలోచించే విధంగా చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈక్రమంలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో తేలాలంటే ఈనెల 17వరకూ ఓపిక పట్టాల్సి ఉంది.


